తెలంగాణా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

తెలంగాణా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం!
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు...

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ముఖేష్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. వైద్యులు చికిత్స అందిస్తున్నారని కుమారుడు విక్రమ్ గౌడ్ తెలిపారు. ఆస్పత్రి వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ముఖేష్ గౌడ్‌ను ఆస్పత్రికి తరలించారని తెలియగానే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో ఆస్పత్రికి వెళ్లారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ముఖేష్ గౌడ్ ఏడు నెలలుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.. డాక్టర్లు పలు సర్జరీలు చేశారు.. వైద్యం కూడా అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం కొంత క్షీణించినట్లు తెలుస్తోంది. ఆదివారం పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

ముఖేష్ తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖేష్ గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories