థాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీ నుంచి వైదొలిగిన సింధు..

థాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీ నుంచి వైదొలిగిన సింధు..
x
Highlights

భారత్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగింది. ఇటీవల...

భారత్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగింది. ఇటీవల జరిగిన ఇండోనేషియా ఓపెన్ లో రెండో స్థానం లో నిలిచింది సింధు. తరువాత జరిగిన జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్ తోనే ఆగిపోయింది. ఇప్పుడు థాయ్ టోర్నీకి ఆమె ఆడకపోవడం విశేషం. ఇక ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం తో భారత్ బ్యాడ్మింటన్ జట్టు ఆశలన్నీ సైనా నెహ్వాల్ మీదే ఉన్నాయి. సైనా కూడా మొన్నటి వరకూ ఫిట్ నేస్ సమస్యలతో టోర్నీలకు దూరంగా ఉంది. ఇండోనేషియా, జపాన్ ఓపెన్ టోర్నీల్లో పాల్గోలేదు. ఇప్పడు సింధు గైర్హాజరీలో థాయ్ ఓపెన్ కు ఆమె హాజరవుతుండడంతో ఆమె పై పెద్ద అంచనాలే ఉన్నాయి. బుధవారం సైనా తన తోలి మ్యాచ్ ఆడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories