Tik tok:ప్రస్తుతం ఫోన్ లో ఉన్న టిక్ టాక్ ల సంగతేంటి?

Tik tok:ప్రస్తుతం ఫోన్ లో ఉన్న టిక్ టాక్ ల సంగతేంటి?
x
Highlights

Tik tok:చైనాకి సంబంధించిన 59 యాప్ లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Tik tok: చైనాకి సంబంధించిన 59 యాప్ లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో టిక్ టాక్ యాప్ తో పాటుగా యూసీ బ్రౌజర్ యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్ , హలో, లైక్, యూకామ్, మేకప్ , వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్ , కామ్ స్కానర్ , మొబైల్ లెజెండ్స్ , న్యూ వీడియో స్టేటస్ , ఫోటో వండర్ , వీ మీట్ లతో పాటుగా మొదలగు యాప్స్ ఉన్నాయి.

ప్లే స్టోర్ నుంచి మళ్ళీ టిక్‌టాక్‌ ను కొత్తగా ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. అయితే అప్పటికే ఫోన్ లో ఉన్న టిక్‌టాక్ సంగతేంటి అన్న ప్రశ్నను చాలా నెటిజన్లు అడుగుతున్నారు. బ్యాన్ లిస్టులో ఉన్న యాప్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని నిలిపివేయాలని ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు ఇస్తుంది. అవి అలా చేస్తే డౌన్‌లోడ్ అయి ఉన్నా.. నెట్ అవసరమయ్యే యాప్స్ పనిచేయవు. సో ఫోన్ లో ఉన్న టిక్‌టాక్ ను ఓపెన్ చేయగానే నో ఇంటర్నెట్ అని చూపిస్తోంది అన్నమాట!

గత కొన్ని రోజుల ముందు ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. అయితే వారికి ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. గతంలోనూ పలువురు ఎంపీలు కూడా ఈ యాప్ లను నిషేధించాలని పార్లమెంట్ లో తమ గళం విప్పారు. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories