Alternatives to Chinese Apps : టిక్‌టాక్‌, జూమ్‌ వంటి చైనా యాప్‌లకు ప్రత్యామ్నాయం ఇవే..

Alternatives to Chinese Apps : టిక్‌టాక్‌, జూమ్‌ వంటి చైనా యాప్‌లకు ప్రత్యామ్నాయం ఇవే..
x
Highlights

Alternatives to Chinese Apps :సరిహద్దులోని జూన్ 15 గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Alternatives to Chinese Apps : సరిహద్దులోని జూన్ 15 గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం చైనా దేశానికి చెందిన పలు యాప్‌లపై నిషేదం విధించింది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, జూమ్, హెలో యాప్ లపై నిషేదం విధించింది. ఆ యప్స్ అన్‌ ఇన్‌స్టాల్‌ అలాంటి యాప్‌లకు ప్రత్యామ్నాయం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

టిక్‌టాక్ ప్రత్యామ్నాయం యావ్స్ ఇవే..

'టిక్‌టాక్‌' సోషల్ మీడియాలో

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఫిదా అవుతున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పడు వీడియోలు చేస్తూ స్నేహితులతో పంచుకునే వెసులుబాటు ఉంది. ఇది చైనా యాప్ కావడంతో దీనిపైనా బ్యాన్ పడింది. టిక్‌టాక్‌తో పాటు విగో వీడియో, లైక్‌, హెలో యాప్‌‌ల పైనా నిషేధం పడింది. అయితే టిక్‌టాక్ కంటే ముందు డబ్ స్మాష్ చాలా పాపులర్. ప్రస్తుతం ఇది లేటెస్ట్ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఇకపై వీటికి బదులుగా రొపొసొ, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌లాంటి వాటిని కూడా ప్రయత్నించవచ్చు.

కాన్ఫరెన్స్‌ల కోసం...

వీడియో కాన్ఫరెన్స్‌ అంటే జూమ్‌ యాప్‌ను తెగ వాడుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంతో దీని వాడకం బాగా పెరిగింది. ఆఫీస్ మీటింగ్స్ కోసం ఆన్లైన్ క్లాసులు ఈ యాప్ ద్వారా చేస్తున్నారు.. ఈ యాప్‌ను వాడకూడదని భారత ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి బదులు దేశీయంగా రూపొందించిన సే నమస్తే యాప్‌ను ట్రై చేయొచ్చు. గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌ లాంటివి వాడుకొవచ్చు.

ఫైల్స్‌ పంపించుకోవడం కోసం..

చాలా మంది మొబైల్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే మరో యాప్ 'షేర్ ఇట్'. ఇది కూడా చైనా యాపే కావడంతో కేంద్రం నిషేధించింది. దీనికి ప్రత్నామ్నాయంగా 'షేర్‌ ఫైల్స్‌', 'ఫైల్స్‌ బై గూగుల్‌' ఫైల్ షేరింగ్ యాప్‌లు ఉన్నాయి. వీని ద్వారా ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, యాప్స్‌ ఒకరి నుంచి మరొకరికి పంపుకోవచ్చు. షేర్‌ఇట్‌‌తో పాటు జెండర్‌ లాంటి యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా గూగుల్‌కు చెందిన ఈ యాప్స్‌ను వాడుకోవచ్చు.

యూసీ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయం ఇదే..

చైనాకు చెందిన చాలా మొబైళ్లలో డిఫాల్ట్‌గా యూసీ బ్రౌజర్‌ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని తొలగించినా పెద్ద నష్టం ఏమీ లేదు. గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇవే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. యూసీ బ్రౌజర్ ద్వారా విలువైన వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రక్షణ కోసం..

మొబైల్‌లోకి ఎలాంటి వైరస్‌ ప్రవేశంచకుండా, ప్రమాదకరమైన ఫైల్స్‌ను తొలగించేవే సెక్యూరిటీ యాప్స్‌. చాలా మొబైల్స్‌లో డీఫాల్ట్‌గా వచ్చే వన్‌ సెక్యూరిటీ యాప్‌ బదులు ఏవీజీ, అవాస్టా, నార్తన్‌‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వీడియోల ఎడిట్‌ కోసం..

వీడియోలను ఎడిట్‌ చేయడానికి, సులభంగా, వేగంగా ఆడియోను జోడించడానికి వైవా వీడియో, వైవా కట్‌, ఫిల్మోరా వంటి యాప్స్‌ను వాడుతున్నారు. వీటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే... కైన్‌ మాస్టర్‌, అడొబ్‌ ప్రిమియర్‌ క్లిప్‌, మ్యాజిస్టో యాప్స్‌ వాడుకోవచ్చు.

ఫొటోలు అందంగా రావడానికి

ఫొటోలను అందంగా మెరుగుపర్చడం, అదనపు హంగులు అద్దడం కోసం యువత ఎక్కువగా యూక్యామ్‌, బ్యూటీక్యామ్‌, బ్యూటీ ప్లస్‌ యాప్‌లు చైనావి కావడంతో వాటిపై కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. వీటి స్థానంలో పిక్స్‌ ఆర్ట్‌, అడొబ్‌ ఫొటోషాప్‌, లైట్‌ రూమ్‌, గూగుల్‌ స్నాప్‌సీడ్‌, బీ612 యాప్స్‌ను ప్రయత్నించి చూడండి.

లాక్‌ యాప్స్‌

ఫొటోలు, వీడియోలు, యాప్స్‌ ఇతరులకు కనిపించకుండా ఉండేందుకు వీటిని వాడుతుంటారు. ఇలాంటి యాప్స్‌లో మొదటి వరుసలో ఉండేవి యాప్‌లాక్‌.. వాల్ట్‌. వీటికి బదులుగా లాక్‌ యాప్‌ - స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ - ఫింగర్‌ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వాల్ట్‌ తదితర యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

స్కాన్‌ చేయాలంటే...

డాక్యూమెంట్లు, ఫొటోలను సులభంగా మొబైల్‌తోనే స్కాన్ చేయగలుతున్నారు.. ఇందుకోసం చాలా మంది క్యామ్‌ స్కానర్‌ యాప్‌ను వాడుతున్నారు దీనిపై నిషేధంఅన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే దీనికి ప్రత్యామ్నయంగా..భారత్‌లో రూపొందించిన డాక్ స్కానర్‌-పీడీఎఫ్‌ క్రియేటర్‌, డాక్యూమెంట్‌ స్కానర్‌-పీడీఎఫ్‌ క్రియేటర్‌ను ప్రయత్నించొచ్చు. అలాగే అడొబ్‌ స్కాన్‌, మైక్రోసాఫ్ట్‌ లెన్స్‌, ఫొటో స్కాన్‌ బై గూగుల్‌ లాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories