టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేసినందుకు భార్యను హత్య చేసిన భర్త

టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేసినందుకు భార్యను హత్య చేసిన భర్త
x
Highlights

వద్దని చెబుతున్నా వినకుండా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో వీడియోలను పోస్ట్ చేసినందుకు భార్యను కిరాతకంగా చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు....

వద్దని చెబుతున్నా వినకుండా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో వీడియోలను పోస్ట్ చేసినందుకు భార్యను కిరాతకంగా చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దాల చిన్న నసరయ్య తన భార్య గోర్రపతి సువర్త (19) ను గొంతు కోసి, తరువాత ఆమె మృతదేహాన్ని గుంటూరు జిల్లాలోని శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలోని శ్మశానవాటికలో దహనం చేశాడు. నవంబర్ 17 న ఈ సంఘటన జరిగినప్పటికీ, సమగ్ర దర్యాప్తు తర్వాత 10 రోజులకు కేసును చేదించారు. ప్రముఖ ప్రైవేటు కంపెనీలో సేల్స్‌పర్సన్‌గా పనిచేస్తున్న నసరయ్యకు, సువార్తకు ఐదేళ్లకిందట వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. సువార్తకు టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఆలా చెయ్యడం నరసయ్యకు ఇష్టం లేదు.పైగా ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు.

భర్త ప్రవర్తన కారణంగా సువర్తా ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయి సత్తెనపల్లి పట్టణంలోని హాస్టల్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె తన భర్తకు మరింత కోపం తెప్పిస్తూ టిక్‌టాక్ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంది. నవంబర్ 14 న ఇంటికి తిరిగి రావాలని నసరయ్య ఆమెను ఒప్పించాడు. అయినా ఆమె వినలేదు. దాంతో కోపోద్రిక్తుడైన నరసయ్య తన తమ్ముడు చిన్న వెంకయ్యతో కలిసి భార్యను గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. తరువాత మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై గ్రామానికి సమీపంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లి దహనం చేశారు. అయితే గ్రామంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తిని దహనం చేశారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి దర్యాప్తులో హత్యకు పాల్పడింది ఆమె భర్త, మరిదేనని కనుగొన్నారు. దాంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories