Covid19 Latest Updates: తెలంగాణలో అన్ని పార్టీలను వణికిస్తున్న కరోనా
Coronavirus Pandemic in Political Parties: తెలంగాణలోని అన్ని పార్టీలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అధికార ప్రతిపక్షాలని తేడా లేకుండా ప్రధాన పార్టీలను గజగజలాడిస్తుంది. ఏకంగా రాష్ట్ర హోమంత్రి మహమూద్ అలీ కి కరోన సోకడంతో రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, తాజాగా హోమ్ మంత్రి మహమూద్ అలీ కరోన బారిన పడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సైతం ఇద్దరు సీనియర్ నేతలు వి. హనుమంతరావు , గూడూరు నారాయణ రెడ్డి కి కరోన సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సైతం కరోన సెగ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత చింతల రామచెంద్రారెడ్డికి కరోన చికిత్స పొందుతున్నారు.
Next Story




