గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కె.ఆర్.సచిదానందన్ (48) మృతిచెందారు.

Raj
By Raj
Published on: 19 Jun 2020 1:37 PM IST
గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి
X

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కె.ఆర్.సచిదానందన్ (48) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సచిదానందన్ గురువారం రాత్రి త్రిస్సూర్‌లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయనకు ఆర్థోపెడిక్ స‌మ‌స్య‌ ఉంది. దాంతో ఇటీవల ఆయ‌న‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆప‌రేష‌న్ చేశారు వైద్యులు.

అయితే ఆప‌రేష‌న్ త‌ర్వాత కోలుకుంటున్న సచిదానందన్ కు హఠాత్తుగా గుండెపోటు రావ‌డంతో త్రిచూర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వెంటిలేట‌ర్ మీద ఉంచి చికిత్స అందిస్తుండగా సచిదానందన్ క‌న్నుమూశారు. ఆయన మరణ వార్త మలయాళ చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసింది. సచిదానందన్ మృతిపట్ల నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ, తోవినో థామస్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.

Raj

Raj

Next Story