రాజమౌళి సినిమాపై వర్మ షాకింగ్ కామెంట్స్.. ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే పట్టించుకోరు

రాజమౌళి సినిమాపై వర్మ షాకింగ్ కామెంట్స్.. ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే పట్టించుకోరు
x
Ram Gopal Varma (File Photo)
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో జరుగుతున్న గొడవలపై కూడా స్పందించాడు. అందరూ ఒకటి కావడం అనేకంటే పెద్ద బూతు మరోటి లేదని కామెంట్ చేసాడు. ఎవడికి వారే లోపల బయట మరోలా ఉంటారని చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో ఎవర్ని పట్టించుకోరని ఏ వ్యక్తి అయినా.. నష్టపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిపై జోకులు వేసుకుంటూ.. కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ వర్మ చెప్పుకొచ్చాడు. రాజమౌళి సినిమాలు వరస విజయాలు అందుకుంటుంటేనే పొగుడుతారని, కానీ అదే ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్.ఆర్. ఆర్ ఫ్లాప్ అయితే మాత్రం చాలా మంది పండగ చేసుకుంటారని వర్మ అన్నాడు. కానీ ఇదెవరూ ఒప్పుకోరని వర్మ అన్నారు.

సినిమా షూటింగులు తిరిగి ప్రారంభించదానికి ప్రభుత్వ నిబంధనలపై కూడా వర్మ స్పందించారు. షూటింగ్ సుమయంలో ప్రభుత్వ వర్గాలు నిఘా పెట్టగలవా అంటూ వర్మ ఎదురు ప్రశ్నించాడు. కరోనా సమస్యతో థియేటర్స్‌లో సీట్లు తగ్గించి టిక్కెట్టు రేటు పెంచితే ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదని చెప్పాడు. గాడ్సే జీవితంపై సినిమా తీయడం తన ఆశయం అని కానీ తన సినిమాలో గాంధీని మాత్రం కించ పరచనని క్లారిటీ ఇచ్చాడు.

లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకు పరిమితమైతే ఇంట్లో తాను అంట్లు తోముకుంటూ కూర్చోనంటూ.. క్లైమాక్స్, కరోనా వైరస్ సినిమాలు చేసాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ మీడియా సంస్థతో కలిసి చేసిన క్లైమాక్స్ సినిమాను ఆన్‌లైన్ థియేటర్‌లోకి విడుదల చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories