పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..

టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత వివాహంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది.

Samba Siva Rao
Published on: 6 Jun 2020 10:37 AM IST
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..
X
Actress madhavi latha(File photo)

టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత వివాహంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అంతేకాదు మాధవీలత పెళ్లి ఫిక్స్ అయిందని కొందరంటే, లేదు లేదు ఆల్రెడీ సీక్రెట్‌గా పెళ్లి కూడా అయిపోయి ఉండొచ్చు అని నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు మాధవీలత పెళ్లి వార్తలతో హోరెత్తిస్తున్నారు. అయితే దీనికి కారణం ఆమె పెట్టిన పోస్ట్. మాధవీలత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు.

చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది. '' నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ను నమ్ముతాను. చాలా చాలా చాలా ఆనందంగా ఉన్నాను. త్వరలోనే ప్రకటన చేస్తాను'' అని పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్ పెళ్లి గురించే తప్ప మరొకటి కాదంటూ విశ్లేషణలు మొదలయ్యాయి.

అయితే ఈ వార్తలపై మాధవీలత స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన పెళ్లి ఇప్పట్లో ఉండదని తేల్చిచెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ తన స్నేహితులు పెడుతున్న కామెంట్స్‌ చూసి పడి పడి నవ్వుకుంటున్నానని వెల్లడించింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తప్ప ఇప్పట్లో పెళ్లి ఊసే లేదని, అన్నీ కుదిరితే 2021లో పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొంది. అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే వెతికిపెట్టండి అంటూ తమదైన శైలిలో స్పందించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story