సామాన్యులకు షాక్.. 16వ రోజు భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా వరుసగా 16వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Samba Siva Rao
Updated on: 22 Jun 2020 11:16 AM IST
సామాన్యులకు షాక్.. 16వ రోజు భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
X

దేశవ్యాప్తంగా వరుసగా 16వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఒకవైపు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెరిగిన ఇంధన రేట్లు మరింత బరాన్ని మోపుతున్నయి.

గత 16 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.36 పైసలు, డీజిల్‌పై రూ.8.82 పైసలు ధరలు పెరిగాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇలా ఉన్నాయి.

లీటర్‌ పెట్రోల్‌ ధర :

చెన్నైలో 82.58 రూపాయలు

బెంగుళూరు 81.81 రూపాయలు

ఢిల్లీలో 79.23 రూపాయలు

కోల్‌కతా 80.95 రూపాయలు

ముంబైలో 86.04 రూపాయలు

హైదరాబాద్‌లో 82.25 రూపాయలు

లీటర్‌ డీజిల్‌ ధర :

చెన్నైలో 75.80 రూపాయలు

బెంగుళూరు 74.43 రూపాయలు

ఢిల్లీలో 78.27 రూపాయలు

కోల్‌కతాలో 73.61 రూపాయలు

ముంబైలో 76.69 రూపాయలు

హైదరాబాద్‌లో 7.49 రూపాయల

Samba Siva Rao

Samba Siva Rao

Next Story