రేపు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌

Arun Chilukuri
Updated on: 21 March 2020 3:30 PM IST
రేపు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌
X
hyderabad metro

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌ కానున్నాయి. మెట్రో మాల్స్‌ను కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సేవలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కవని రైల్వే ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story