పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి

Arun Chilukuri
Published on: 18 Jan 2020 1:22 PM IST
పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి
X
పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మంగళపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. లైట్లు రిపేర్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులు శ్రీనివాసరావు, మౌలాలి, శేఖర్‌గా గుర్తించారు.

ఇనుప స్టాండ్‌ సాయంతో పెట్రోల్‌ బంకులో విద్యుత్‌ బల్బు మారుస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విద్యుత్‌ వైరు ఇనుప స్టాండ్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్‌ మౌలాలి(22) అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్‌ (48) ప్రాణాలు కోల్పోయాడు. మృతులు బొప్పూడి, పోలిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story