pm modi: ఆరోగ్య భారత్ కు అందరూ ముందుకు రావాలి!

pm modi: ఆరోగ్య భారత్ కు అందరూ ముందుకు రావాలి!
x
Highlights

‘అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి. అంటూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు.

ఆరోగ్యభారత్ కోసం అందరూ ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. జాతీయ క్రీదాదినోత్సవం సందర్భంగా ఈరోజు అయన 'ఫిట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన చక్కని ఆరోగ్యానికి ఫిట్నెస్ ఒక్కటే మార్గం అని చెప్పారు. ఇంకా అయన ఏమన్నారంటే..

'అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి. జీవితంలో వ్యాయామం, క్రీడలు ఒక భాగం కావాలి. క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. అలా ఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. దీన్ని నేటి యువతరం గుర్తించాలి. వ్యాయామం చేయాలని చెప్పడమే కాదు.. చేసి చూపించాలి. నేటి కాలంలో సాంకేతికత పెరగడం వల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారు. కనీసం 2వేల అడుగులు కూడా వేయలేని పరిస్థితి. దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతపై విస్తృత చర్చ జరగాలి. ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలి. ఫిట్‌నెస్‌ ఆవశ్యకతపై వీడియో రూపొందించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిద్దాం. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిద్దాం. ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్‌నెస్‌ కంటే ప్రత్యామ్నాయం లేదు. విజయానికి ఎలివేటర్‌ ఉండదు.. మెట్లెక్కి చేరుకోవాల్సిందే. ఆరోగ్యకరమైన వ్యక్తి.. ఆరోగ్యకరమైన కుటుంబం.. ఆరోగ్యకరమైన సమాజం.. నవ భారతాన్ని ఆరోగ్య భారతంగా తీర్చిదిద్దేందుకు మార్గాలివే' అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను మరోసారి అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories