Jammu and Kashmir: కాశ్మీర్ ‌లోయాలో మరో ఉగ్రవాది ఏరివేత

కాశ్మీర్ ‌లోయాలో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఈ ఘటన షోమియన్ లో చోటుచేసుకుంది.

Raj
By Raj
Updated on: 21 Jun 2020 9:19 PM IST
Jammu and Kashmir: కాశ్మీర్ ‌లోయాలో మరో ఉగ్రవాది ఏరివేత
X

కాశ్మీర్ ‌లోయాలో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఈ ఘటన షోమియన్ లో చోటుచేసుకుంది. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ప్రారంభించిన సంయుక్త ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆర్మీ ట్వీట్ చేసింది.. అందులో 'లకిర్‌పూర్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఆపరేషన్ కొనసాగుతోందని ' అని పేర్కొంది.

కాగా నాలుగు రోజుల్లో ఇప్పటివరకు 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. షోమియన్ ఎన్‌కౌంటర్ సందర్బంగా ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల నిరసనను కూడా నిషేధించబడిందని అన్నారు. మరోవైపు మృతిచెందిన ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు.

Raj

Raj

Next Story