కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత : హిజ్బుల్‌ కమాండర్‌ హతం..

కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత : హిజ్బుల్‌ కమాండర్‌ హతం..
x
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులపై మరోసారి తుపాకీ మోత మోగింది.

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులపై మరోసారి తుపాకీ మోత మోగింది. భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లోని రెబాన్ ప్రాంతంలో ఇది జరిగింది. ఈ ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న తరువాత దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ముందుగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తరువాత సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని అన్నారు, భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు.

ఈ ఆపరేషన్ ఆరు గంటలకు పైగా కొనసాగిందని, ఈ సమయంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు రాళ్ళు కూడా విసిరారని పోలీసులు తెలిపారు. అయితే అదనపు బలగాలు , ఇంటర్నెట్‌ను నిలిపివేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా మరణించిన ఉగ్రవాదులలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫరూక్ అసద్ నల్లి , అలాగే ఒక విదేశీ జాతీయుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories