Defence Minister Rajnath Singh reached Ladakh : లద్దాక్ చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్

Arun Chilukuri
Published on: 17 July 2020 10:13 AM IST
Defence Minister Rajnath Singh reached Ladakh : లద్దాక్ చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్
X

Defence Minister Rajnath Singh reached Ladakh : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ శుక్రవారం ఉదయం‌ లద్దాఖ్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి లేహ్‌‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌కు సైనిక, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడ నుంచి శనివారం మధ్యాహ్నం శ్రీనగర్‌‌కు వెళ్లనున్న రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

రాజ్‌నాథ్‌తో పాటు రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తదితరులు ఉన్నారు. చైనా, పాకిస్తాన్ రెండు దేశాల సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో లద్దాక్, జమ్మూ కశ్మీర్‌లలో రక్షణ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కొద్ది రోజులే కిందటే రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story