Coronavirus Updates India: దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా ఉధృతి

Coronavirus Updates India: భారత్‌లో‌ కరోనా ఉధృతి కొన‌సాగుతుంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Karampoori Rajesh
Updated on: 17 Aug 2020 10:03 AM IST
Coronavirus Updates India:  దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా ఉధృతి
X
Coronavirus Updates in india

Coronavirus Updates India: భారత్‌లో‌ కరోనా ఉధృతి కొన‌సాగుతుంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 26,47,663కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 57,982 కేసులు నమోదు కాగా, 941 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,76,900 ఉండగా, 19, 19,842మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 50,921 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.51 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.92 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 25.57 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 3,00,41,400 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల చేసిన‌ట్లు వైద్య‌శాఖ తెలిపింది.



Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story