Coronavirus updates in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 894 కేసులు

Coronavirus updates in Telangana: తెలంగాణాలో నేడు కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. కొన్ని రోజుల ముందు దాకా రోజుకు రెండు వేల కేసులు దాకా నమోదు కాగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Karampoori Rajesh
Published on: 17 Aug 2020 9:21 AM IST
Coronavirus updates in Telangana:  తెలంగాణ‌లో కొత్త‌గా 894 కేసులు
X
Coronavirus

Coronavirus updates in Telangana: తెలంగాణాలో నేడు కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. కొన్ని రోజుల ముందు దాకా రోజుకు రెండు వేల కేసులు దాకా నమోదు కాగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా తెలంగాణా వైద్యారోగ్య శాఖ విడుద‌ల చేసిన‌ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 894 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 92,255కు చేరింది. ఇక 24 గంటల్లో 2,006 కరోనా నుండి కోలుకోగా ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 70,132కు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో పది మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 703కు చేరింది. ఇక ప్రస్తుతానికి తెలంగాణాలో 21,420 కేసులు యాక్టివ్ గా ఉండగా, 14,404 మంది హోం ఐసోలేషణ్ లో ఉన్నారు. జిల్లాల వారిగా వివ‌రాలిలా.. జీహెచ్ఎంసీలో 147 , మేడ్చెల్ లో 51, కరీంనగర్ లో 69, వరంగల్ అర్బన్ లో 44, రంగరెడ్డి లో 85, పెద్దపల్లిలో 62, సిద్దిపేటలో 58 కేసులు నమోదయ్యాయి . మిగతా జిల్లాల్లో కేసులు కాస్త తక్కువగానే నమోదయ్యాయి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story