తెలంగాణలో కొత్తగా 1,102 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 16 Aug 2020 9:15 AM IST
తెలంగాణలో కొత్తగా 1,102 పాజిటివ్ కేసులు..
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(శనివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,102 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 91,361కి చేరింది. మృతుల సంఖ్య 693కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,930మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 68,126కి చేరింది. ప్రస్తుతం 22,542 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నఒక్కరోజే 12,120 మంది నమూనాలను పరీక్షించగా 1,102 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 234 కేసులు, క‌రీంనగ‌ర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.76 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.




S. Srikanth

S. Srikanth

Next Story