Coronavirus updates in Tamilnadu: తమిళనాడులో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
Coronavirus updates in Tamilnadu: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Coronavirus updates in Tamilnadu 5,914 New cases registered in 24 hours
Coronavirus updates in Tamilnadu: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటి 3,02,815కు చేరింది.
వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,44,675 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 53,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా కొత్తగా 114 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,041 చేరింది.
Next Story




