Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 62,064 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Updated on: 10 Aug 2020 12:32 PM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 62,064 కరోనా పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 22 లక్షల 15 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 62,064 కేసులు నమోదు కాగా, 1007 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 54,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 22,15,075 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,34,945 ఉండగా, 15,35,744 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 44,386 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 29.20 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story