Special flight : భారత రాష్ట్రపతి, ప్రధానిల విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానం

Special flight : భారత రాష్ట్రపతి, ప్రధానిల విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Special flight : దేశంలో ప్రధానమంత్రికి భద్రత అనేది అత్యంత సవాలుతో కూడిన అంశం. ఎంత సెక్యూరిటీ ఉన్నా... శత్రువులతో బెడద తప్పదు.

Special flight : దేశంలో ప్రధానమంత్రికి భద్రత అనేది అత్యంత సవాలుతో కూడిన అంశం. ఎంత సెక్యూరిటీ ఉన్నా... శత్రువులతో బెడద తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలకు ఇక నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానాన్ని ఉపయోగించనున్నారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధానుల కోసం ప్రత్యేకంగా రెండు విమానాలను ఆర్డర్ పెట్టగా వచ్చే నెలలో ఒక విమానం రానుంది. ఈ ఇలాంటి ప్రత్యేకమైన విమానం ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా ఆధ్యక్షుడు మాత్రమే ఉపయోగిస్తున్న అత్యంత అధునాతనమైన శక్తివంతమైనది. ఈ విమాన్ని ఎంతో ట్రెయిన్ అయిన ఎయిర్‌ఫోర్స్ పైలట్లు మాత్రమే నడిపించగలరు. కాగా ఈ విమానానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వన్‌గా నామకరణం చేయనున్నారు. ఆకాశంలో ఎగురుతున్న ఈ కోటలాంటి విమానం చాలా సురక్షితం, శత్రువు దాడులు చేయాలనుకున్నా ఏమీ చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే అదే విమానాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ లాగే పీఎం నరేంద్ర మోడీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ సిద్ధం చేస్తున్నారు. ఇది బోయింగ్ 777 విమానం, అభేద్యమైన వైమానిక విమానంగా మార్చబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం తయారు చేసిన ఈ ప్రత్యేకమైన విమానం తరువాతి భాగంలో EW జామర్ అమర్చబడింది. ఇది శత్రువు రాడార్ సిగ్నల్‌ను బ్లాక్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ సిగ్నల్‌ను బ్లాక్ చేస్తుంది, తద్వారా దానిపై క్షిపణిని ప్రయోగించినట్లయితే అది లక్ష్యాన్ని చేరదు. క్షిపణి గురించి జామర్ సమాచారాన్ని ఇస్తుంది. విమానం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన క్షిపణి అప్రోచ్ సిస్టమ్, విమానంపై క్షిపణిని ప్రయోగించిన వెంటనే అది హెచ్చరిస్తుంది. అదనంగా, ఈ క్షిపణి ఎంత దూరం వస్తోంది, ఏ వేగంతో మరియు ఏ ఎత్తులో ఉందో సమాచారం ఇస్తుంది. ఇంతే కాకుండా హీట్ సింక్ క్షిపణుల నుండి రక్షించడానికి ఇది మంటలను కలిగి ఉంది. పేరుకు తగ్గట్టు గానే ఇవి క్షిపణులు వేడి వైపు ఆకర్షితులవుతాయి. ఈ మంటల నుండి చాలా వేడి బయటకు వస్తుంది, ఇది క్షిపణి దిశను ఒక వైపుగా కాకుండా గందరగోళానికి గురి చేస్తుంది. అంతే కాకుండా ఇది పూర్తిగా మిర్రర్ బాల్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది పరారుణ సిగ్నల్‌ను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేటి ఆధునిక క్షిపణులు ఇన్‌ఫ్రా రెడ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా నడుస్తాయి, ఇది వాటి సిగ్నల్‌ను అడ్డుకుంటుంది, దీనివల్ల క్షిపణి విఫలమవుతుంది. ఇందులో అత్యంత ఆధునిక, సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. అంటే, దీని ద్వారా, ప్రధాని మోడీ బయట వ్యక్తులతో మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ మూలనున్న వ్యక్తులతోనైనా మాట్లాడగలరు. కానీ ఈ విమానంలో మాట్లాడిన వారి సంభాషణను మాత్రం టేప్ చేయలేము. అలాంటి రెండు విమానాలను ప్రధాని, రాష్ట్రపతి కోసం తీసుకున్నారు. ఇక ఈ విమానాల ధర విషయానికొస్తే సుమారు 8458 కోట్లుగా చెప్పుకోవచ్చు.



Show Full Article
Print Article
Next Story
More Stories