Air Asia flight hits Bird: పక్షిని ఢీకొట్టిన విమానం..తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

Air Asia flight hits Bird: పక్షిని ఢీకొట్టిన విమానం..తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!
x
Highlights

Air Asia flight hits Bird: కేర‌ళ రాష్ట్రం కోజికోడ్‌లో విమాన ప్రమాదం ఘటన మరువకముందే జార్ఖండ్‌లో మరో విమాన ప్రమాదం జరిగింది.

Air Asia flight hits Bird: కేర‌ళ రాష్ట్రం కోజికోడ్‌లో విమాన ప్రమాదం ఘటన మరువకముందే జార్ఖండ్‌లో మరో విమాన ప్రమాదం జరిగింది. పైల‌ట్ అప్ర‌మ‌త్త‌మై విమానాన్ని నిలిపివేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. రాంచీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఒక పక్షి తగిలింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాశ్రయంలోనే ఫ్లైట్‌ను నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం తగిన పరిశీల‌న‌లు జ‌రిగిన‌ అనంతరం విమానం తిరిగి బ‌య‌లుదేరుతుంద‌ని ఆయ‌న చెప్పారు. విమానం రాంచీ నుంచి ముంబయి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories