Agriculture Loan To 2.5 Crore Farmers : రైతులకు గుడ్ న్యూస్.. 4 శాతం వడ్డీకే చవక రుణాలు ఇస్తున్న కేంద్రం

Agriculture Loan To 2.5 Crore Farmers : రైతులకు గుడ్ న్యూస్.. 4 శాతం వడ్డీకే చవక రుణాలు ఇస్తున్న కేంద్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Agriculture Loan To 2.5 Crore Farmers : దేశానికి అన్నం పెట్టే రైతులను, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల్ని అమలు చేసింది.

Agriculture Loan To 2.5 Crore Farmers : దేశానికి అన్నం పెట్టే రైతులను, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల్ని అమలు చేసింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న రైతులను అప్పుల ఊబీ నుంచి బయటకు తీసుకురావడానికి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. ఈ పథకం మాత్రమే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యోజననే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న రైతులందరికీ కేంద్రం రుణాలు కూడా అందిస్తోంది.

2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల సులువు మరియు రాయితీ క్రెడిట్ లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తుంది. ఈ రైతులకు కెసిసి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అయితే రైతులు మనీల్యాండర్స్ నుంచి రుణం తీసుకుంటే వారికి వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డి ఎక్కువ అవుతుండడంతో రైతులు అసలు వడ్డీ రెట్టింపు అయి ఆ రుణం నుంచి త్వరగా బయట పడలేడు. దీంతో ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. అన్నదాతలు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతు రుణాల్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి ఏటా రైతులకు రుణాలను అందిస్తూ 4 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు, ఇది దేశంలో అన్నిరకాల రునాలపై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే అతి తక్కువ రేటు అన్నారు మంత్రి.

ఇక పోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేసీసీ పథకానికి 111.98 లక్షల మంది కొత్త రైతులను చేర్చింది. ఈ రైతుల సంఖ్యతో కేసీసీ పథకం కింద సుమారు ఏడున్నర కోట్ల మంది లబ్ధిదారులు వచ్చారని తెలిసింది. కాగా ఆ రైతులకు దీని కింద రూ .89,810 కోట్ల చౌక రుణం ఇచ్చారు. ఫిబ్రవరి 24 న, పిసి కిసాన్ పథకంతో కెసిసిని కనెక్ట్ చేయడం ద్వారా కార్డు సులభతరం చేయబడింది. ముందుగా ప్రారంభించిన పిఎం-కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్యకు, కెసిసి కార్డుదారుల సంఖ్యకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. అయినా ప్రభుత్వం అందరికీ డబ్బు ఇవ్వాలనుకుంటుందని మంత్రి తెలిపారు.

అంతకుముందు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేవి. ఇక పోతే కిసాన్ క్రెడిట్ కార్డుపై ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వడ్డీ రేటు 4 శాతంగా, రూ .1.60 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను గడువు ముగిసేలోపు చెల్లిస్తే రూ .3 లక్షలకు పెంచవచ్చు. మోడీ ప్రభుత్వం పిఎం-కిసాన్ సమ్మన్ నిధిని అనుసంధానించినట్లయితే, రుణం తీసుకోవడానికి కార్డు పొందడం చాలా సులభం. ఈ ఏడాది రూ .15 లక్షల కోట్ల వ్యవసాయ రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే వారి రెవెన్యూ రికార్డ్, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఇక KCC ఫారం పొందాలంటే ముందుగా మీరు https://pmkisan.gov.in వెబ్ సైట్‌కు వెళ్ళాలి. ఆ తరువాత వెబ్‌సైట్‌లో, ఫార్మర్ ట్యాబ్‌కు కుడి వైపున కెసిసి ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత, దాన్ని నింపాల్సి ఉంటుంది. ఇందులో, రైతు మొదట తాను దరఖాస్తు చేస్తున్న బ్యాంకు పేరు , బ్రాంచ్ పేరు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా సులభంగా నింపి దరఖాస్తు పూర్తి చేసి రుణాన్ని పొందవచ్చు. నింపిన ఫారమ్ ను సమీప వాణిజ్య బ్యాంకుకు సమర్పించవచ్చు. రైతులు ఫారమ్ ఇచ్చిన తరువాత కార్డు సిద్దం కాగానే బ్యాంకు రైతుకు సమాచారం అందిస్తుంది. లేదా నేరుగా రైతు ఫారంలో ఇచ్చిన చిరునామాకు నేరుగా పోస్ట్ చేయబడుతుంది. ఇప్పటికే ఉన్న కార్డు యొక్క పరిమితిని పెంచడానికి మరియు క్లోజ్డ్ క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి ఈ ఫారమ్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కార్డు లేని వారు క్రొత్త క్రెడిట్ కార్డు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
Show Full Article
Print Article
Next Story
More Stories