Top
logo

Coronavirus updates in AP: ఏపీలో కొనసాగుతున్న క‌రోనా విజృంభ‌న‌.. కొత్త‌గా 7,665 కేసులు

Coronavirus updates in AP:  ఏపీలో కొనసాగుతున్న క‌రోనా విజృంభ‌న‌.. కొత్త‌గా 7,665 కేసులు
X
Coronavirus updates in AP
Highlights

Coronavirus updates in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Coronavirus updates in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 1,45,636 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 87,773 మంది చికిత్స పొందుతున్నారు.

గ‌త 24 గంట‌ల్లో కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..అనంతపురంలో 631, చిత్తూరులో 479, ఈస్ట్‌ గోదావరిలో 1235, గుంటూరులో 621, కడపలో 439, కృష్ణలో 146, కర్నూలులో 883, నెల్లూరులో 511, ప్రకాశంలో 450, శ్రీకాకుంలో 354, విశాఖపట్నంలో 620, విజయనగరంలో 574, పశ్చిమ గోదావరిలో 722 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

అలాగే.. గ‌త 24గంట‌ల్లో క‌రోనాకు .. ప్రకాశంలో 11మంది, గుంటూరులో 10మంది, పశ్చిమ గోదావరిలో 9మంది, కడపలో 7, శ్రీకాకుళంలో 7, చిత్తూరులో 6, కర్నూల్‌లో 6, అనంతపూర్‌లో 5, నెల్లూరులో 5, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, తూర్పుగోదావరిలో 4 చొప్పున మొత్తం 80 మంది క‌రోనాకు బ‌లయ్యారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2116 కి చేరింది.


Web TitleCoronavirus updates in AndhraPradesh 7,665 New cases registered in 24 hours
Next Story