ఇండియాలో చికిత్స కేసులను దాటేసిన రికవరీలు

ఇండియాలో చికిత్స కేసులను దాటేసిన రికవరీలు
x
Representational Image
Highlights

తొలిసారి కరోనా యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదయింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సగం మందికి పైగా బాధితులు కోలుకున్నారు....

తొలిసారి కరోనా యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదయింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సగం మందికి పైగా బాధితులు కోలుకున్నారు. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. 1,35,206 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లకు వెళ్లిపోయారు. మరో 1,33,632 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి 7,745 మంది మరణించారు.

కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న భారతీయులకు కొన్ని గణాంకాలు ఊరట కలిగిస్తున్నాయి. ఇండియాలో తొలిసారిగా చికిత్స పొందుతున్న కరోనా కేసుల సంఖ్యను రికవరీలు దాటేశాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 9,985 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇదే సమయంలో ఇంతవరకూ 1,35,206 మంది రికవరీ అయ్యారు. ఇదే సమయంలో 1.33 లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ తొలి కేసు వచ్చిన తరువాత రికవరీల సంఖ్య 50 శాతం దాటడం ఇదే ప్రథమం.

ఇంతవరకూ ఇండియాలో 7,745 మంది వైరస్ సోకి మరణించగా, 279 మంది గడచిన 24 గంటల్లో చనిపోయారు. ప్రస్తుతం ఇండియా మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఐదో స్థానంలో ఉంది. ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే దేశాలు కొనసాగుతున్నాయి. ఇండియాలో కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ గా ఉన్న మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికే 90వేలు దాటింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ లక్షల్లో కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో ఒక వైపు కేసులు విజృంభణ కొనసాగుతూనే ఉన్నా..కరోనా యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సగం మందికి పైగా బాధితులు కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెలువరించిన ఈ వివరాలు కాస్త ఊరట కలిగించేవిగా కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories