హకీంపేటకు చేరుకున్న సంతోష్ బాబు‌ పార్థివదేహం

సరిహద్దులో చైనా జరిపిన దొంగదాడిలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం సాయంత్రం హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్‌ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు.

Raj
By Raj
Updated on: 18 Jun 2020 7:12 AM IST
హకీంపేటకు చేరుకున్న సంతోష్ బాబు‌ పార్థివదేహం
X

సరిహద్దులో చైనా జరిపిన దొంగదాడిలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం సాయంత్రం హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్‌ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు. అక్కడ సంతోష్‌ బాబు పార్థివదేహానికినికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, మంత్రుల కేటీఆర్‌, మల్లారెడ్డిలతో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళుర్పించారు.

ఆ తరువాత ఆర్మీ అధికారులు కూడా సైనిక లాంఛనాలతో వందనం సమర్పించనున్నారు. మరోవైపు సంతోష్‌ బాబు కుటుంబసభ్యులు కూడా హకీంపేటకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ఔటర్ రింగ్ రోడ్‌ మీదుగా సంతోష్‌ పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించనున్నారు.


Raj

Raj

Next Story