Air India: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఆ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్..!

Air India: విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్. విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్

Dhatripriya
Updated on: 9 Jun 2023 4:16 PM IST
Air India Apologizes For Emergency Landing In Russia
X

Air India: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్...క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా.!

Air India: ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇటీవల రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక విమానాన్ని పంపించడంతో ప్రయాణికులు మగడాన్ నుంచి నిన్న మధ్యాహ్నం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ఈ క్రమంలో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎయిరిండియా ఈ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, వారికి డబ్బులు రిఫండ్ ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.

ప్రయాణికులను శాన్‌ఫ్రాన్సిస్కోకు చాలా ఆలస్యంగా తీసుకువెళ్లినందుకు క్షమాపణలు తెలుపుతున్నామని, సాంకేతిక సమస్య రావడంతో ఈ ఇబ్బంది ఎదురయిందని ఎయిరిండియా పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని రష్యాలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రయాణికులను తరలించేందుకు మరో ప్రత్యేక విమానం పంపించినప్పటికీ... అది కూడా ఆలస్యం అయిందని పేర్కొంది. ఎయిరిండియా విమాన ప్రయాణికుల సహనానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, గతాన్ని తాము మార్చలేమని, కానీ... మీకందిరికీ కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఇందుకుగాను ప్రయాణానికి తాము తీసుకున్న టిక్కెట్ డబ్బు పూర్తిగా రిఫండ్ చేస్తామని, భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్ వోచర్ కూడా ఇస్తున్నామని ఎరియిండియా తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story