Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 11,458 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 13 Jun 2020 9:42 AM IST
Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 11,458 కరోనా పాజిటివ్‌ కేసులు
X

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 11,458 కేసులు నమోదు కాగా,386 మంది ప్రాణాలు విడిచారు. ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,08,993 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,45,779 ఉండగా, 1,54,329 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 8,884 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story