SIIMA Awards 2021: హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ లో సైమా అవార్డ్స్

SIIMA Awards 2021 Held in September At Hyderabad Officially Announced by SIIMA
x

సైమా అవార్డ్స్‌-2021

Highlights

* సెప్టెంబర్‌ 11, 12న సైమా వేడుక * అఫిషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ చేసిన సైమా * విదేశాల్లో కాకుండా తొలిసారి స్వదేశంలో వేడుక

SIIMA Awards 2021: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ - సైమా.. ఈ పేరు వింటే వచ్చే కిక్కే వేరప్ప. సౌత్‌ సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒకే వేదికపైకి వచ్చి చేసే ఆ సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్‌ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోతుంటే ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. అలాంటి వేడుక గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది కూడా సైమా ఉండదేమోనని సినీ ప్రియులు భావిస్తున్న సమయంలో గుడ్‌న్యూస్‌ చెప్పింది సైమా. 2021 అవార్డుల వేడుకకు సంబంధించి తేదీ, వేదిక ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

మీ నిరీక్షణకు తెరపడింది. సైమా అవార్డ్స్‌ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండుగ జరుపుకుందాం అంటూ సైమా పేర్కొంది. హైదరాబాద్‌ వేదికగా సైమా అవార్డ్స్‌ వేడుక జరగనున్నట్టు ప్రకటించింది. 2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలుకాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటివరకు 8 సార్లు అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కానీ ఆ కార్యక్రమాలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఇప్పుడు తొలిసారి హైదరాబాద్‌ వేదికగా సైమా అవార్డ్స్‌ వేడుక జరగనుంది. మరి ఎవరెవరిని అవార్డులు వరిస్తాయో తెలియాలంటే మరొకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories