Rhea Chakraborty Arrested : రియా చ‌క్రవ‌ర్తి అరెస్టు..

Rhea Chakraborty Arrested : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో

Krishna
Updated on: 8 Sept 2020 5:23 PM IST
Rhea Chakraborty Arrested : రియా చ‌క్రవ‌ర్తి అరెస్టు..
X

Rhea Chakraborty

Rhea Chakraborty Arrested : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే కేసులో భాగంగా నటి రియా చక్రవర్తిని గత మూడు రోజుల పాటుగా విచారిస్తున్న ఎన్‌సీబీ రియాని కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేసింది. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ కేసులో ప‌లువురిని అరెస్టు చేశారు. అందులో రియా చక్రవర్తి సోద‌రుడు శౌవిక్‌తో పాటు సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ సామ్యూల్ కూడా ఉన్నారు.


అటు విచారణలో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారం..రియాని అరెస్టు చేసిన త‌ర్వాత డ్రగ్స్ రిక‌వ‌రీ కోసం ఆమెను వివిధ ప్రాంతాల‌కు ఎన్‌సీబీ తీసుకువెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రియాకు వైద్య ప‌రీక్షలు చేయ‌నున్నారు. డ్రగ్స్ తీసుకున్నదేమో అన్న కోణంలో ఎన్‌సీబీ అధికారులు ఆమెకు డ్రగ్స్ ప‌రీక్షలు నిర్వహించనున్నారు.. పరీక్షల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు.. వైద్య ప‌రీక్షల కోసం ఆమెను సియాన్ హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లనున్నారు.

Krishna

Krishna

Next Story