Sushant Singh Rajput case : కీలక మలుపు.. సుశాంత్ సోదరి, డాక్టర్ పై కేసు పెట్టిన రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త కీలక మలుపు తిరిగింది, బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ సృష్టించారని.. ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ ఎలా..

Raj
By Raj
Published on: 7 Sept 2020 6:04 PM IST
Sushant Singh Rajput case : కీలక మలుపు.. సుశాంత్ సోదరి, డాక్టర్ పై కేసు పెట్టిన రియా చక్రవర్తి
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త కీలక మలుపు తిరిగింది, బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ సృష్టించారని.. ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తూ.. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ నటి రియా చక్రవర్తి సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చట్టవిరుద్ధమైన ప్రిస్క్రిప్షన్ పొందిన ఐదు రోజుల్లోనే సుశాంత్ మరణించాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం.. నియంత్రించబడే మందులను డాక్టర్ తరుణ్ కుమార్.. ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఇవ్వడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే రియా చక్రవర్తిని రేపు మరోసారి ఎన్‌సిబి 3 వ రౌండ్ విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రోజులు డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంపై రియాను ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ మిరాండా ఉన్నారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నటి రియా చక్రవర్తి సుశాంత్‌ను మనోవేదనకు గురిచేసిందని, ఆమెతోపాటు మరికొందరు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని నటుడి తండ్రి బిహార్‌లో కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది.

Raj

Raj

Next Story