Ram Gopal Varma Tweet on Pawan Kalyan: వర్మ ' పవర్ స్టార్' హీరో ఎవరో తెలిసిపోయింది.. వివరాలు ఇవే!

Ram Gopal Varma Tweet on Pawan Kalyan: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఎం మాట్లాడుతాడో.. ఎం సినిమా చేస్తాడో ఎవరికి అర్థం

Krishna
Updated on: 30 Jun 2020 8:26 PM IST
Ram Gopal Varma Tweet on Pawan Kalyan: వర్మ  పవర్ స్టార్ హీరో ఎవరో తెలిసిపోయింది.. వివరాలు ఇవే!
X

Ram gopal varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఎం మాట్లాడుతాడో.. ఎం సినిమా చేస్తాడో ఎవరికి అర్థం కాదు.. లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ప్రేమ కథని సినిమాగా తీయనున్నట్లుగా ప్రకటించాడు.

పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమా చేయనున్నట్లు వర్మ ఇటీవల ప్రకటించాడు. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశాడు వర్మ.. అయితే తమ అభిమాన నటుడు పేరుతో ఉన్న బిరుదుతో వర్మ సినిమా చేస్తున్ననని ప్రకటించడంతో పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు..

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయనున్నట్టుగా వర్మ ప్రకటించాడు..అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు.. పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ ఉన్న వీడియోను వర్మ రిలీజ్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్టార్ ఇతనే. ఆయన నా ఆఫీస్‌కి వచ్చినపుడు తీసిన వీడియో ఇది. అతను ఎవరినైనా పోలి ఉంటే నేను ఎం చేయలేను "అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేశారు.

దీనితో అతను ఎవరు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.. అతని పేరు నరేష్. భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందినవాడు.. అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. . ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ..అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట.. అయితే ఇంకా డీల్ ఒకే కాలేదని ప్రస్తుతం ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చర్చలు మాత్రమే నడిచాయని సమాచారం..

Krishna

Krishna

Next Story