మర్డర్ సినిమాపై అమృత మాట్లాడలేదు : బాలస్వామి

Arun Chilukuri
Published on: 22 Jun 2020 5:06 PM IST
మర్డర్ సినిమాపై అమృత మాట్లాడలేదు : బాలస్వామి
X

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫాదర్స్‌ డే సందర్భంగా ' మర్డర్‌' సినిమాకు సంబంధంచి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. పోస్టర్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆమె అన్నట్టు కథనాలు వచ్చాయి. అమృత వ్యాఖ్యలకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని నిజమైన స్టోరీ అని చెప్పలేదని అన్నారు.

మరోవైపు ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటివరకూ 'మర్డర్‌' సినిమా గురించి ఆమె ఏవిధంగానూ స్పందించలేదని తెలిపారు. ఆమె పేరుతో వస్తోన్న స్టేట్‌మెంట్స్‌ను నమ్మవద్దని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story