మెగా డాటర్ నీహారిక పెళ్లి కుదిరిందట!

మెగా డాటర్ నీహారిక పెళ్లి కుదిరిందట!
x
Niharika Instagram Photos
Highlights

కొణిదెల వారింట త్వరలో పెళ్లిబాజాలు మొగనున్నాయని తెలుస్తోంది. మెగాబ్రదర్ నాగబాబు కొమార్తె నీహారిక వివాహానికి ఏర్పాట్లు సాగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి.

కొణిదెల వారింట త్వరలో పెళ్లిబాజాలు మొగనున్నాయని తెలుస్తోంది. మెగాబ్రదర్ నాగబాబు కొమార్తె నీహారిక వివాహానికి ఏర్పాట్లు సాగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల నీహారిక పెళ్లి విషయమై ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నాల్లో ఉన్నామంటూ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె పెళ్ళికి ఏర్పాట్లు వేగంగా సాగిపోతున్నాయట. ఇప్పటికే వరుడు ఫిక్స్ అయిపోయాడని చెప్పుకుంటున్నారు.

ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు నీహారిక భర్తగా రాబోతున్నాడని సమాచారం. ఇప్పటికే వరుడు తరఫు వారితో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కుటుంబాలతో సహా కలిసి మాట్లాడుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల నీహారిక తన ఇంస్టాగ్రం ఎకౌంట్ లో పట్టు చీరతో ఉన్న తన ఫోటోలు ఉంచారు. దీనితో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. నీహారిక పెళ్ళిని అంగరంగ వైభవంగా జరపడానికి మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు మొదలు పెట్టేసిందని చెబుతున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories