RGV Plays Bandla Ganesh Role in Powerstar Movie: నటుడిగా మారుతున్న వర్మ.. పాత్ర ఏంటో తెలుసా?

RGV Plays Bandla Ganesh Role in Powerstar Movie: దర్శకుడిగా సినిమాలు చేసి ఇప్పటివరకు చాలా వివాదాలు సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వర్మ నటుడిగా మారబోతున్నాడు.

Krishna
Published on: 13 July 2020 3:38 PM IST
RGV Plays Bandla Ganesh Role in Powerstar Movie: నటుడిగా మారుతున్న వర్మ.. పాత్ర ఏంటో తెలుసా?
X
rgv new movie

RGV Plays Bandla Ganesh Role in Powerstar Movie: దర్శకుడిగా సినిమాలు చేసి ఇప్పటివరకు చాలా వివాదాలు సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వర్మ నటుడిగా మారబోతున్నాడు. తాజాగా వర్మ పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమా చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశాడు వర్మ.. అయితే తమ అభిమాన నటుడి టైటిల్ పైన సినిమా వస్తుండడంతో దర్శకుడు వర్మ పైన పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

ఇక ఈ సినిమాలో ఉన్న పాత్రలను ఒక్కొకటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు వర్మ.. ఇప్పటికే చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ పోలికలతో ఉన్న కొన్ని పాత్రలను వర్మ బయటకు వదిలాడు. అయితే తాజాగా ఈ సినిమాలో బండ్ల గణేష్ కూడా పాత్ర ఉంటుందని ఫిలిం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. అయితే ఈ పాత్రలో రామ్ గోపాల్ వర్మనే నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కు పెద్దగా డైలాగులు వుండవట.. ఆర్జీవీ తన సినిమాలో తనే వేషం వేస్తే ఇది తొలిసారి అవుతుంది. పైగా సోషల్ మీడియాలో మాంచి పాపులారిటీ వున్న బండ్ల గణేష్ వేషం వేస్తే ఇంకా పాపులర్ అవుతుంది. ఎన్నికల అనంతరం జరిగిన కథ అంటూ చెప్పుకోచ్చిన వర్మ ఇందులో బండ్ల క్యారెక్టర్ ని ఎలా పెడతారు అన్నది మరో సందేహాం.. ఇందులో వర్మ నటిస్తాడా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయబోతున్నాడు వర్మ.. ఆ నటుడికి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో.. టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ.. అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట. ఇక ఇప్పటికే టైటిల్ విషయంలో పెద్ద వివాదం సృష్టించిన వర్మ ఇక సినిమా తీసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.

Krishna

Krishna

Next Story