Bandla Ganesh Appears In 'Power Star': పవర్ స్టార్ లో బండ్ల గణేష్?

Bandla Ganesh Appears In Power Star: పవర్ స్టార్ లో బండ్ల గణేష్?
x
bandla ganesh,
Highlights

Bandla Ganesh Appears In 'Power Star': సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఎం మాట్లాడుతాడో.. ఎం సినిమా చేస్తాడో ఎవరికి అర్థం కాదు.. లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు

Bandla Ganesh Appears In 'Power Star': సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఎం మాట్లాడుతాడో.. ఎం సినిమా చేస్తాడో ఎవరికి అర్థం కాదు.. లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమా చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశాడు వర్మ.. అయితే తమ అభిమాన నటుడి టైటిల్ పైన సినిమా వస్తుండడంతో దర్శకుడు వర్మ పైన పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

ఇక ఈ సినిమాలో ఉన్న పాత్రలను ఒక్కొకటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు వర్మ.. ఇప్పటికే చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ పోలికలతో ఉన్న కొన్ని పాత్రలను వర్మ బయటకు వదిలాడు. అయితే తాజాగా ఈ సినిమాలో బండ్ల గణేష్ కూడా పాత్ర ఉంటుందని ఫిలిం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎన్నికల అనంతరం జరిగిన కథ అంటూ చెప్పుకోచ్చిన వర్మ ఇందులో బండ్ల క్యారెక్టర్ ని ఎలా పెడతారు అన్నది చూడాలి మరి!

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయబోతున్నాడు వర్మ.. ఆ నటుడికి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ..అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట. ఇక ఇప్పటికే టైటిల్ విషయంలో పెద్ద వివాదం సృష్టించిన వర్మ ఇక సినిమా తీసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories