Megastar Chiranjeevi Tweet on Amitabh Bachchan: అమితాబ్‌కు మెగాస్టార్‌ చిరు ట్వీట్‌

Megastar Chiranjeevi Tweet on Amitabh Bachchan: అమితాబ్‌కు మెగాస్టార్‌ చిరు ట్వీట్‌
x
Chiranjeevi and Amitabh Bachchan
Highlights

Megastar Chiranjeevi Tweet on Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు శనివారం కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi Tweet on Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు శనివారం కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో కుటుంబసభ్యులు అమితాబ్‌ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. తనకు కరోనావైరస్ సోకిందన్న విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కుటుంబసభ్యులు, ఇంట్లో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయని.. పరీక్షల రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అమితాబ్ కుమారుడు అభిషేక్‌ బచ్చన్ కు‌ కూడా కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు శనివారం అర్ధరాత్రి ట్విట్టర్‌ ద్వారా ఆయనే వెల్లడించారు. జయాబచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యకు కరోనా నెగెటివ్‌గా తేలినట్టు సమాచారం. బిగ్ బి కరోనా భారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

అంతేకాదు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా బిగ్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అమితాబ్ పై ట్వీట్ చేశారు. బిగ్ బి త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో 'అమితాబ్‌ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆయన గులాబో సీతాబో అనే మూవీలో నటించారు. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ హాస్యాన్ని పండించే ఓ వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories