Case filed against Ram Gopal Varma: 'మర్డర్' సినిమాపై కోర్టుకు ప్రణయ్ తండ్రి బాలస్వామి!

Case filed against Ram Gopal Varma: వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకేక్కిస్తుంటాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Krishna
Updated on: 4 July 2020 4:24 PM IST
Case filed against Ram Gopal Varma:  మర్డర్ సినిమాపై కోర్టుకు ప్రణయ్ తండ్రి బాలస్వామి!
X

Case filed aganist Ram Gopal Varma: వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకేక్కిస్తుంటాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ల ప్రేమ కథపై మర్డర్ అనే సినిమా చేస్తున్నట్టుగా వర్మ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వర్మ సినిమా పైన పెద్ద హైప్ క్రియేట్ చేశాడు. దీనిపైన అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఓ లేఖను కూడా రిలీజ్ చేసింది.

తాజాగా ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్మ తెరకెక్కించే ఈ సినిమాలో తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టుల ఫిర్యాదు దాఖలు చేశాడు. అయితే దీనిపైన స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.

ఇక లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలని పక్కన పెడితే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలను తెరకెక్కించాడు. అందులో భాగంగానే 'క్లైమాక్స్, నగ్నం సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో ప్రేక్షకుల మీదికి వదిలాడు. ఇక 12 ఓ క్లాక్‌, పవర్ స్టార్ సినిమాలను త్వరలొనే రిలీజ్ చేయనున్నాడు వర్మ.

Krishna

Krishna

Next Story