IMD Alert Heavy Rain Fall in Mumbai: రాబోయే 48 గంటల్లో అక్కడ భారీ వర్షాలు

IMD Alert Heavy Rain Fall in Mumbai: రాబోయే 48 గంటల్లో అక్కడ భారీ వర్షాలు
x
Highlights

IMD Alert Heavy Rain Fall in Mumbai: రాబోయే 48 గంటలు ముంబైలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది.

IMD Alert Heavy Rain Fall in Mumbai: రాబోయే 48 గంటలు ముంబైలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. శనివారం సముద్ర తీరంలో 4.57 మీటర్ల ఎత్తైన అలలు సంభవిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఐఎండి జారీ చేసిన హెచ్చరికను అనుసరించి, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పౌరులను సముద్ర తీరానికి దూరంగా ఉండాలని సూచన చేసింది. అంతకుముందు, మహానగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు అడపాదడపా మితమైన వర్షం నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

భారత వాతావరణ శాఖ ముంబై కేంద్రం, కొలాబా వాతావరణ బ్యూరో ప్రకారం శుక్రవారం ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య 161.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో, నగరంలోని శాంటాక్రూజ్ లో 102.7 మి.మీ వర్షపాతం నమోదైంది. తీరప్రాంత జిల్లా అయిన రత్నగిరిలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 వరకు 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని హర్నాయ్ వాతావరణ బ్యూరో తెలిపింది, అయితే ఇదే సమయంలో రత్నగిరి 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండి తెలపడం విశేషం. ఇక మరాఠ్వాడాలోని నాండేడ్ వెదర్ బ్యూరో ప్రకారం నాండేడ్ లో ఇదే సమయంలో 20 మి.మీ వర్షపాతం నమోదు చేసింది.

ఇదిలావుంటే రానున్న గంటలలో ముంబై మరియు ప్రక్కనే ఉన్న తీరప్రాంత జిల్లాలలోని పలు ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.. శుక్రవారం నుంచి శనివారం అర్ధరాత్రి వరకూ ఇక్కడ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది ఐఎండి.


Show Full Article
Print Article
Next Story
More Stories