Police Searching For PVP: పీవీపీ కోసం తెలంగాణ పోలీసుల గాలింపు

Arun Chilukuri
Published on: 4 July 2020 2:00 PM IST
Police Searching For PVP: పీవీపీ కోసం తెలంగాణ పోలీసుల గాలింపు
X

Police Searching For PVP: : ఓ ఇంటి నిర్మాణం వివాదం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడనికి వెళ్లగా అతను బంజారాహిల్స్ పోలీసులు పై కుక్కలతో దాడి చేయించాడు. కాగా ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివిరాల్లోకెళితే.. ఓ ఇంటి నిర్మాణం వివాదం కేసులో పీవీపీ (పొట్లూరి వీర ప్రసాద్)ని అరెస్ట్ చేయడనికి వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులపై అతను, అతని అనుచరుడు కుక్కలను వదిలి భయపెట్టాడు. దీంతో ఎస్సై హరీష్ రెడ్డి జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసాడు. కాగా పీవీపీ పోలీసుల కళ్లు కప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కాగా పోలీసులు పీవీపీ కోసం హైదరాబాద్ , విజయవాడలో ముమ్మరంగా గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీస్‌ టీం విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఇంటి నిర్మాణం వివాదం కేసులో హైకోర్టు లో పీవీపీ ముందోస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.

పీవీపీపై గత వారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఇంటి పై భాగంలో నిర్మిస్తోన్న రూఫ్ గార్డెన్‌కు అడ్డుకున్నారని పీవీపీ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని కైలాష్ అనే వ్యక్తి ఆరోపించారు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేశారు. తొలి రోజు విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన పీవీపీ మరుసటి రోజు విచారణకు గైర్హాజరయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story