క్యాస్ట్ ఫీలింగ్ తప్పేంటి? అంటున్న రాంగోపాల్ వర్మ!

క్యాస్ట్ ఫీలింగ్ తప్పేంటి? అంటున్న రాంగోపాల్ వర్మ!
x
Highlights

"నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు అన్నీ కరెక్ట్ అయినపుడు క్యాస్ట్ ఫీలింగ్ తప్పెందుకు అవుతుంది" అంటున్నారు రాంగోపాల్ వర్మ. అయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ అనే పాటను ఈరోజు విడుదల చేశారు.

సూటిగా మాట్లాడే వర్మ.. కచ్చితంగా చెప్పింది చేసే భయంలేని ఆర్జీవీ.. వివాదాస్పద కథల్ని వెండితెర మీద జయాపజయాలతో సంబంధం లేకుండా నిత్యం ఆవిష్కరించే రాంగోపాల్ వర్మ ఇపుడు కులాభిమానం పై పడ్డారు. ఇప్పటికే అయన ప్రకటించిన కులాలనే పేరుగా మార్చిన కొత్తసినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిలే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం కొత్త పాత విడుదల చేసిన ఆర్జీవీ నేరుగా క్యాస్ట్ ఫీలింగ్ తప్పేమిటి? అంటూ విరుచుకు పడ్డారు.

క్యాస్ట్ ఫీలింగ్ పాట ను కొద్దిగంతల ముందు విడుదల చేశారు వర్మ. అందులో "నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు అన్నీ కరెక్ట్ అయినపుడు క్యాస్ట్ ఫీలింగ్ తప్పెందుకు అవుతుందని ఆవేశంగా ప్రశ్నించారు. ఒక పక్క కులాభిమానం మాకు లేదు అంటూనే కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. మరోపక్క కులంతో పనేముంది అని చెబుతూనే ఫలానా కులం వారికి పదవి ఇవ్వాల్సిందే అంటారు.. కొన్ని మీడియాల్లో క్యాస్ట్ ఫీలింగ్ వద్దంటూ ప్రచారం చేస్తారు. అసలు ఈ హిపోక్రసీ ఎందుకు? అని ఆ పాట విడుదల చేసిన వీడియోలో మొదట రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. తరువాత పాటలోనూ అవేరకమైన పదాల పదనిసలు పలకరించాయి. ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాట సినిమాలో సందర్భానుసారంగా వస్తుందని చెప్పిన ఆర్జీవీ.. దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని సూటిగా ప్రశ్నించారు.

ఇక "కమ్మలు... కాపులు... రెడ్లు... రాజులు... వైశ్యులు..." అంటూ ఈ పాట మొదలవుతుంది.వాడిన విజువల్స్ లో కులం పేరు వచ్చినపుడు ఆ కులానికి సంబంధించిన ప్రముఖుల్ని చూపించారు. ఎక్కువగా రాజకీయనాయకుల్ని చూపించిన ఆయన.. ప్రభాస్ ను కూడా రాజుల కుల ప్రతినిధిగా చూపించారు. మరి ఆ కులంలో రాజకీయ నాయకులు లేరనుకుని అలా చేశారో.. ప్రస్తుతం నడుస్తున్న ప్రభాస్ సాహో మేనియాని తన సినిమా ప్రచారానికి చక్కగా వాడుకోవచ్చని చేశారో లోగుట్టు పెరుమాళ్ల కెరుక. మొత్తమ్మీద రాంగోపాల్ వర్మ ప్రచారం కోసం ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. ఆఖరుకు తన కులాన్ని కూడా అని ఈ పాట వీడియో చూసిన వారు అనుకుంటున్నారు. మరి మీరూ వీడియో చూసి అది నిజమో కాదో నిర్ధారించుకోండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories