Pawan Kalyan fans movie on RGV: వర్మ పై పవన్ ఫాన్స్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?

Pawan Kalyan fans movie on RGV: వర్మ పై పవన్ ఫాన్స్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
x
Highlights

Pawan Kalyan fans movie on RGV: వివాదాలకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎవరిమీదా ఏ సినిమా తీస్తాడో ఎవరికీ తెలియదు. వ‌ర్మ జోలికి పోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌రు

Pawan Kalyan fans movie on RGV: వివాదాలకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎవరిమీదా ఏ సినిమా తీస్తాడో ఎవరికీ తెలియదు. వ‌ర్మ జోలికి పోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌రు. కానీ ఇప్పుడు వర్మ పైన ఓ సినిమా మొదలైంది. అవును.. నిజమే.. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న చాలా మందిపై ఇప్పటివరకు వర్మ సెటైరికల్ సినిమాలు తీశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని వర్మ పైన ఓ సెటైరికల్ సినిమాకి ప్లాన్ చేశాడు.. టైటిల్ 'పరాన్న జీవి'. 'రెక్‌లెస్ జెనిటిక్ వైరస్' అనేది ట్యాగ్ లైన్.

99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాని తెరకెక్కుతుండగా , డాక్టర్ నూతన్ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను మీడియాకి వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తుంటే, వర్మ పై పవన్ ఫాన్స్ ఓ సినిమా తీస్తుండడంతో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అంతకుముందు జొన్నవిత్తుల!

అయితే దీనికంటే ముందు తెలుగు సినిమా గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు వర్మ పైన ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆర్జీవీ - రోజూ గిల్లే వాడు' అనే టైటిల్‌ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఎందుకో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు.

పవర్ స్టార్ vs పరాన్న జీవి

వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమాను ఈనెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో వర్మ విడుదల చేస్తున్నారు. ఇక అదే రోజున దానికి పోటిగా పరాన్న జీవి సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ అవుతున్న జూలై 22వ తేదీనే పరాన్న జీవి ట్రైలర్ కూడా వస్తుడడం! ఇక ఇందులో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories