Power Star Movie Song: పవర్ స్టార్ సినిమా నుంచి 'గడ్డి తింటావా' సాంగ్ రిలీజ్!

Power Star Movie Song: లాక్ డౌన్ సమయంలో అందరూ మేకర్స్ సినిమాలను పక్కన పెట్టేసి ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.

Krishna
Updated on: 19 July 2020 7:32 PM IST
Power Star Movie Song: పవర్ స్టార్ సినిమా నుంచి గడ్డి తింటావా సాంగ్ రిలీజ్!
X

Power Star Movie Song: లాక్ డౌన్ సమయంలో అందరూ మేకర్స్ సినిమాలను పక్కన పెట్టేసి ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (ఆన్‌లైన్)లో రిలీజ్ చేసిన వర్మ.. తాజాగా పవర్ స్టార్ సినిమా పేరుతో ఓ సినిమాని చేస్తున్నాడు.

ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసి పెద్ద వివాదం సృష్టించిన వర్మ తాజాగా ఆదివారం సాయంత్రం సినిమా నుంచి మొదటి సాంగ్ ని విడుదల చేశాడు. 'గడ్డి తింటావా' తౌడు తింటావా అనే లిరిక్స్ తో ఈ పాట సాగుతుంది. అయితే ఈ పాటను పవన్ పాత్రధారే పాడినట్టుగా వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే ఈ పాటకు సాహిత్యం ఎవరు అందించారో మాత్రం అర్జీవీ వెల్లడించలేదు.

ట్రైలర్ చూడాలంటే డబ్బుల కట్టాలిసిందే!

ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్టుగా వర్మ వెల్లడించాడు. అయితే చిత్ర ట్రైలర్ ని డబ్బులు పెట్టి చూడడం అనేది ప్రపంచ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.. చిత్ర ట్రైలర్ కి రూ.25 చెల్లించాలని వర్మ ఇప్పటికే ప్రకటించాడు.

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయబోతున్నాడు వర్మ.. ఆ నటుడికి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ..అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట. ఇక ఇప్పటికే టైటిల్, సాంగ్ విషయంలో పెద్ద వివాదం సృష్టించిన వర్మ ఇక సినిమా తీసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.



Krishna

Krishna

Next Story