Ram Gopal Varma new controversy: లార్డ్ బాలాజీ మీద ఒట్టు.. ఎవరిని ఉద్దేశించి సినిమా తీయడం లేదు : వర్మ

Ram Gopal Varma new controversy: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'పవర్ స్టార్'... ఈ రోజు ఈ సినిమాకి సంంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని రిలీజ్ చేశాడు వర్మ

Krishna
Updated on: 10 July 2020 12:01 PM IST
Ram Gopal Varma new controversy: లార్డ్ బాలాజీ మీద ఒట్టు.. ఎవరిని ఉద్దేశించి సినిమా తీయడం లేదు : వర్మ
X

Ram Gopal Varma new controversy: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'పవర్ స్టార్'... ఈ రోజు ఈ సినిమాకి సంంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని రిలీజ్ చేశాడు వర్మ.. ఈ ఫస్ట్ లుక్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన 'పవర్ స్టార్' సినిమా టైటిల్ మధ్యలో గాజు గ్లాసు( జనసేన పార్టీ గుర్తు) పెట్టిన వర్మ పెద్ద వివాదానికి తెర లేపాడు.. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నికల తర్వాత కథ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో పవన్ ఫాన్స్ పెద్ద ఎత్తున వర్మ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే తన పైన వస్తున్న విమర్శల పైన వర్మ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. తానూ ఎవరిని ఉద్దేశించి సినిమాను తీయడం లేదని కావాలంటే వెంకటేశ్వర స్వామి మిద ఒట్టు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఫస్ట్ లుక్ తో ఇన్ని వివాదాలు సృష్టించిన వర్మ ఇక సినిమాని రిలీజ్ చేసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి

ఇక లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ అనే సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో పవర్ స్టార్ సినిమా ఒకటి.


Krishna

Krishna

Next Story