RGV Movie 'Power Star' First Look: వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్!

RGV Movie 'Power Star' First Look: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ.. ఎప్పుడు, ఎలాంటి సినిమా చేస్తాడో వర్మకే తెలియదు.

Krishna
Published on: 9 July 2020 3:01 PM IST
RGV Movie Power Star First Look: వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్!
X
RGV New movie 'power star' first look

RGV Movie 'Power Star' First Look: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ.. ఎప్పుడు, ఎలాంటి సినిమా చేస్తాడో వర్మకే తెలియదు.. ఇక సినిమా టైటిల్ తోనే సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ చేసుకుంటాడు వర్మ ..తాజాగా పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమాకి సంంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని రిలీజ్ చేశాడు వర్మ.. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి...

ఎందుకంటే తాజాగా విడుదల చేసిన 'పవర్ స్టార్' టైటిల్ మధ్యలో గాజు గ్లాసు పెట్టిన వర్మ..ఇందులో నటిస్తున్న యాక్టర్‌ని ముందుగా హాఫ్ లుక్‌లో చూపిస్తూ తాజాగా ఫుల్ లుక్ ని రిలీజ్ చేశాడు.. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నికల తర్వాత కథ అంటూ క్లారిటీ ఇచ్చాడు.. ఇది చాలదు అన్నట్టుగా పవన్, చిరంజీవి కలిసి ఉన్న మరో స్టీల్ బయటకు వదిలాడు వర్మ.. ఇందులో పవన్ చిరాకుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపైన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి !

ఇక లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ అనే సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో పవర్ స్టార్ సినిమా ఒకటి.

Krishna

Krishna

Next Story