Actor Ashutosh Bhakre commits suicide: ఆత్మహత్య చేసుకున్న మరో యువ నటుడు

Actor Ashutosh Bhakre commits suicide: భారతీయ సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఒకరి మరణం నుంచి కొలుకోకముందే మరోకరు సినీ ఇండస్ట్రీని వీడడం అందరికి షాక్ కి గురిచేస్తోంది.

Krishna
Published on: 30 July 2020 3:07 PM IST
Actor Ashutosh Bhakre commits suicide:  ఆత్మహత్య చేసుకున్న మరో యువ నటుడు
X
MARATI ACTOR

Actor Ashutosh Bhakre commits suicide: భారతీయ సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఒకరి మరణం నుంచి కొలుకోకముందే మరోకరు సినీ ఇండస్ట్రీని వీడడం అందరికి షాక్ కి గురిచేస్తోంది.. తాజాగా బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.. దీని నుంచి కొలుకోకముందే మరో యువనటుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజాగా అశుతోష్ భక్రే (32) అనే మరాఠీ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్ర నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే గటకొద్ది రోజులుగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. అయితే‌ ఆత్మహత్య చేసుకోవడానికి గల సరైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

అశుతోష్ భక్రే ''భకార్, ఇచర్ థార్లా'' లాంటి మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ అయ్యారు. ఇక ఆయన మరాఠీ టెలివిజన్ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను 2016లో వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియకుండా అతని గురించి మాట్లాడటం తప్పని సుశాంత్‌కు సపోర్టు చేస్తూ మయూరి ఒక లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Krishna

Krishna

Next Story