Shoaib Akhtar reacts Sushanth Singh Suicide: సుశాంత్ మృతిపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్!

Shoaib Akhtar reacts Sushanth Singh Suicide: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 1 July 2020 1:30 PM IST
Shoaib Akhtar reacts Sushanth Singh Suicide: సుశాంత్ మృతిపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్!
X

Shoaib Akhtar reacts Sushanth Singh Suicide: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. తాజాగా సుశాంత్ మృతి పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త వినగానే నేను మొదటగా షాక్ అయ్యాను.. నేను మొదటిసారిగా సుశాంత్ ని ముంబైలో కలిశాను. అప్పుడు అతను పొడవాటి జుట్టుతో కనిపించాడు నాకు అప్పుడే తెలిసింది. అతను ఎంఎస్ ధోని బయోపిక్ లో నటిస్తున్నాడని.. అప్పుడు నేను అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఒకవేళ మాట్లాడి ఉంటే అనేక స‌మ‌స్య‌ల‌పై అత‌నితో చ‌ర్చించే వాడిని. దీనితో ఆ స‌మ‌స్య‌ల‌ని ఎలా ఎదుర్కోవాల‌నే ధైర్యం అత‌నికి వ‌చ్చేంది. కానీ అప్పుడు మాట్లాడనందుకు బాధపడుతున్నానని షోయబ్ అక్తర్ అన్నాడు.

ఇక గతంలో హీరోయిన్‌ దీపిక పదుకొనే కూడా డిప్రెషన్ లో ఉందని, అప్పుడు అందరికి చెప్పి ఆ డిప్రెషన్ నుంచి బయట పడిందని తెలిపాడు. ఇక సుశాంత్‌ కూడా అలాగే చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదోమో అని అక్తర్ చెప్పుకొచ్చాడు..

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Krishna

Krishna

Next Story