Kriti Sanon on Sushant Singh Rajput Dil Bechara Movie: సుశాంత్ సినిమా చూసి కృతిసనన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

Kriti Sanon on Sushant Singh Rajput Dil Bechara Movie: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి

Krishna
Published on: 27 July 2020 2:00 PM IST
Kriti Sanon on Sushant Singh Rajput Dil Bechara Movie: సుశాంత్ సినిమా చూసి కృతిసనన్‌ ఎమోషనల్ పోస్ట్‌!
X
Kriti Sanon, Sushant Singh Rajput (File photo)

Kriti Sanon on Sushant Singh Rajput Dil Bechara Movie: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది.

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.. ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయగా అభిమానుల కోసం ఫ్రీగా అవకాశాన్ని కలిపించారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేసింది." స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నువ్వు నిజంగా జీవించి వచ్చావనిపించింది. నీ అసలైన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలో పెట్టి నటించావు" అని కృతిసనన్‌ పేర్కొంది. ఇక దర్శకుడు ముఖేశ్‌ చబ్రా, కథానాయిక సంజనా సంఘీలకు శుభాకాంక్షలు తెలియజేసింది.. మొదటి సినిమాలోనే భావోద్వేగాలను పలికించిన సంజనా సంఘీకి మంచి భవిష్యత్తు ఉందని కృతిసనన్‌ వెల్లడించింది. ఇక అంతకుముందు కృతిసనన్‌ , సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కలిసి 'రాబ్తా' అనే సినిమాలో కలిసి నటించారు.

Krishna

Krishna

Next Story