నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాడు.. టాప్ హీరోపై కంగన విమర్శలు

నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాడు.. టాప్ హీరోపై కంగన విమర్శలు
x
Highlights

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌, అగ్రకథానాయకుడు హృతిక్‌ రోషన్‌కు, ఆమెకు మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసిందే.

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌, అగ్రకథానాయకుడు హృతిక్‌ రోషన్‌కు, ఆమెకు మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసిందే. హృతిక్‌ రోషన్ తనతో సన్నిహితంగా ఉండేవాడని, ఇద్దరం ప్రేమించుకున్నామని చాలా ఏళ్ల క్రితం కంగన ఆరోపించారు. ఆయన తనకు మెసేజ్‌లు పంపించేవడని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వీరిద్దరి వ్యవహారం కేసు వరకు కూడా నడిచింది. కంగన తాజా ఇంటర్వ్యూలో 'నా మాజీ లవర్' అంటూ మరోసారి పేర్కొన్నారు.

నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అద్దె ఇంట్లో జీవిస్తుంటే నేను సొంత ఇల్లు, ఆఫీసు కొన్నానని 'ఇవాళ నేను గర్వంగా ఉన్నా. నా మాజీ ప్రియుడు ఇళ్లు వాళ్ల నాన్న కట్టాడు' అని ఆమె పేర్కొన్నారు.

తన కెరీర్‌ ప్రారంభ సమయంలో ఎటువంటి లక్ష్యాలు లేవని ఆమె చెప్పింది. కానీ కొన్నేళ్ల క్రితం ప్రేమలోపడ్డ తర్వాత లీగల్‌ కేసు నడిచింది. ఆ సమయంలో జరిగిన చర్చలు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చింది. తాను ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయినని.. నా మాజీ బాయ్ ఫ్రెండ్ వెనుక డబ్బుల కోసం వెంటపడ్డానని అందరూ చర్చించుకున్నారు. అమ్మాయిల్ని ఈ సమాజం అలా చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ' అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మాటల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ఓ మహిళగా నాకు డబ్బులపై ఆశలేదు.. కానీ ప్రజలు నన్ను ఆస్తికోసం ప్రేమించే అమ్మాయిగా చూశారు. నా మనసు మారింది. నాకంటూ అన్నీ ఉండాలని నిర్ణయించుకున్నా...అందమైన ఇల్లు, ఆఫీసు ఉండాలి అనుకున్నా. నాకు 50 ఏళ్లు వచ్చేసరికీ ఇండియాలోని సంపన్నుల్లో ఒకదానిగా నిలవాలని లక్ష్యం పెట్టుకున్నా. పరిస్థితులు నాలో ఈ కసిని పెంచాయి'అని కంగన ఇంటర్వ్యూ లో చెప్పారు.

హృతిక్‌, కంగన మధ్య చాలాకాలం ప్రేమాయణం నడిచింది. అప్పట్లో వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. వీళ్ళ గొడవలు కేసుల వరకు వెళ్లాయి. కాగా.. హృతిక్ తన స్నేహితులందరికీ ఆమె నా డబ్బుల కోసం ప్రేమిస్తున్నానని వెంటపడింది అని చెప్పుడని కంగన ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories